మైలార్‌దేవ్‌పల్లి/అత్తాపూర్, సెప్టెంబర్ 10: భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అత్తాపూర్ హైదర్‌గూడ తాళ్ళకుంట చెరువు వద్ద శ్రీరామ వాషర్‌మేన్ కో-ఆపరేటీవ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడు తూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందన్నారు. తొలితరం ఉద్యమ నాయకురాలిగా ఉన్న ఆమె నేటి తరంవారికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు సురేందర్‌రెడ్డి, అత్తాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, వివిధ పార్టీల నాయకులు కె. సుభాష్‌రెడ్డి, కొమ్రయ్య, బండా రు రమేష్, సుధాకర్‌రెడ్డి, చిత్తారీ, చిన్న, కె.హరినాథ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వీర వనిత చాకలి ఐలమ్మ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు గా, భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ వీర మహిళ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని శివాజీ చౌక్ చౌరస్తాలో లక్ష్మిగూడ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే టి ప్రకాశ్ గౌడ్ పాల్గొని ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ వీర మహిళగా సాయుధ పోరాటంలో పాల్గొని ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నా రు. నేటి మహిళలు ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ముందుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు టి ప్రేమ్‌గౌడ్, రఘుయాదవ్, యంజాల మహేశ్‌రాజ్, రాజు ముదిరాజ్, లక్ష్మిగూడ రజక సంఘం నేతలు బాలయ్య, క్రిష్ణ, నర్సింహ, ఎల్లయ్య, పి మల్లేశ్ , మహేశ్, వేణుగోపాల్, రమేశ్ రాజు, యాదగిరి, జగదీశ్ పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 10: మహిళలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పెద్దతూప్ర, పాలమాకులలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ విముక్తికోసం ఐలమ్మ అనేక పోరాటాలు చేయడంతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేశారు. ఆమె స్ఫూర్తిగా నేడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటయ్య, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సింహ, వార్డు సభ్యులు దాస్, సురేష్, పాలమాకుల ఉప సర్పంచ్ ప్రవీణ్‌గౌడ్, శ్రావణ్‌గౌడ్, రజక సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే శంషాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాం వద్ద కౌన్సిలర్ కుమార్ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళ్లు అర్పిం చారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.