మాదాపూర్, సెప్టెంబర్ 8: దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమంలో భాగంగా మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో గురువారం దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారుడు కేశవులుకు మంజూరైన కిరణాషాపును ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ విచ్చేసి స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు చూడలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని, దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దళితులు తలెత్తుకునేలా బతకాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ గౌస్, రాజు ముదిరాజ్, తైలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో రూ.1 కోటి 68 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, హైదరానగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేస్తు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
అన్ని కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, వరద నీటి కాలువల అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ గౌస్, రాజు ముదిరాజ్, గోకుల్ ప్లాట్స్ వార్డు సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, సంజీవ్‌రెడ్డి, ఏసు పాదం, రాజేశ్, ప్రసాద్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.