చిట్టిపొట్టి అడుగులేస్తూ.. ముద్దుముద్దుగా మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లోని 90మంది కవల పిల్లలు ఒకేచోట చేరి ముచ్చటగొలిపారు. ఆదివారం
ఓ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో జరగగా.. కవల పిల్లలు సందడి చేస్తూ ర్యాంప్ వాక్ చేశారు. అలాగే మాదాపూర్
హెచ్ఐసీసీలో ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ కోలాహలంగా జరిగింది. చిన్నారులు ఆధునిక దుస్తులు ధరించి అలరించారు.
జేసీఐ (జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్) సికింద్రాబాద్ స్వర్ణోత్సవ వేడుకలు కంటోన్మెంట్‌లోని క్లాసిక్ గార్డెన్లో ఆదివారం సందడిగా జరిగాయి. ఈ సారి జరిగిన వేడుకల్లో తెలుగు రాష్ట్రాల్లోని 90 మంది కవల పిల్లల జోడీలు ఒక్కచోట చేరి సందడి చేశారు. ఈ సందర్భంగా జేసీఐ సికింద్రాబాద్ అధ్యక్షుడు భవేశ్కుమార్ మాట్లాడుతూ ఈ సారి జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో కవలలతో సందడి చేయాలని నిర్ణయించామని ఈ మేరకు చిన్నారి కవలల నుంచి మొదలుకొని 30 సంవత్సరాల కవలల వరకు వేడుకలకు ఆహ్వానించామన్నారు. ఇందులో భాగంగా ర్యాంప్‌పై వయస్సుల వారీగా కవలలు చేసిన ర్యాంప్ వాక్, వివిధ సినీ గేయాలపై చేసిన చూడ చక్కని నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హరీశ్, సలేఖ, సుదానవా, నవీన్, చంద్రశేఖర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఇండియన్ కిడ్స్ వేర్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ పేరిట ఏర్పా టు చేసిన కార్యక్రమంలో చిన్నారులు పలు రకాల దుస్తులను ధరించి క్యాట్ వాక్ చేస్తూ అలరించారు.