వెంగళరావునగర్, సెప్టెంబర్ 4: జూబ్లీహిల్స్ నియోజవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆదివారం వెంగళరావునగర్ డివిజన్లోని కల్యాణ్ నగర్ వెంచర్-1 థీమ్ పార్కులో నిర్వహిస్తున్న సుందరీకరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యం కోసం తమ ప్రభుత్వం లక్షలు వెచ్చించి పార్కులను సందరీకరించినట్లు తెలిపారు. త్వరితగతిన పార్కును సుందరంగా తీర్చిదిద్ది కల్యాణ్ నగర్ కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ దేదీప్య విజయ్, కాలనీ ఫెడరేషన్ చైర్మన్ సత్యనారాయణ, రామరాజు, హనుమంత్ రావు, డివిజన్ నాయకులు వేణుగోపాల్ యాదవ్,మాజీ కార్పొరేటర్ శ్యామ్రావు పాల్గొన్నారు.