కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వినాయక నవరాత్రోత్సవాల్లో మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ లు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల చెరువు నీరు కలుషితమవుతుందని అందులో నివసించే జీవరాసుల మనుగడకు ముప్పు వాటిళ్లుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు, ఉపాధ్యాయులు, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ నేతలున్నారు.
కేపీహెచ్‌బీ కాలనీలో..
కేపీహెచ్‌బీ కాలనీ వార్డు కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంహెచ్‌వో వెంకటరమణ, ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి, ఎస్ఆర్పీ శ్రీనివాస్, స్థానిక నేతలు కట్టా నరసింగరావు, గఫూర్, జీఎల్ఎన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నూతి రాంబాబు నాయుడు, రాము, ప్రతాప్, రాంధన్ నాయక్, తిరుపతి చారీ, పద్మారెడ్డి, సుబ్బలక్ష్మి, అనూరాధ, కృష్ణమూర్తి, కన్నాలత, రమాదేవి ఉన్నారు.
బాలాజీనగర్‌లో..
బాలాజీనగర్ వార్డు ఆఫీస్‌లో కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నేతలు వెంకటేశ్ చౌదరీ, బండి సుధ, రమణ, రవీందర్‌రెడ్డి, ఆరోగ్యరెడ్డి, సుభాష్ గౌడ్, యోగీ, కల్యాణీ తదితరులున్నారు.
ఫతేనగర్‌లో..
ఫతేనగర్‌లో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ పండాల సతీశ్ గౌడ్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వార్డులో 1500 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, జీహెచ్ఎంసీ అధికారులున్నారు.
మట్టి గణపతులనే పూజిద్దాం..
మూసాపేట, ఆగస్టు29: పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మూసాపేట కార్పొరేటర్ కోడిచర్ల మహేందర్ అన్నారు. డివిజన్ పరిధి అవంతినగర్ తోటలో జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేందర్ హాజరై మట్టి గణపతుల ప్రతిమలను కాలనీ వాసులకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, భాస్కర్, రమేశ్నాయర్, శోభరాజన్, ఎర్రస్వామి, నాగరాజు పాల్గొన్నారు.
మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని బాగ్మీర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రోజాదేవి సోమవారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్కాంత్రెడ్డి, యాదయ్య, యాదగిరి, జగదీశ్, ముళి, మల్లేశ్, రాజు, భాస్కర్, స్వరూప, కిరణ్ పాల్గొన్నారు.
పర్యావరణ హితం కోసం మట్టి వినాయకుడినే పూజించాలని కార్పొరేటర్ సబీహాబేగం అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్ వార్డు కార్యాయలంలో జీహెచ్ఎంసీ అందిస్తున్న మట్టివినాయక ప్రతిమలను కార్పొరేటర్ డివిజన్ ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వీరారెడ్డి, కొండం శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, మాధవచారి, కమల్‌హాసన్, శ్యామ్‌సుందర్‌రెడ్డి, యోగిరాజు తదితరులు పాల్గొన్నారు.
– అల్లాపూర్,ఆగస్టు29