సుల్తాన్‌బజార్, ఆగస్టు 24 : దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ పేర్కొన్నారు. బుధవారం గన్‌ఫౌండ్రీలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయ ంలో టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ యూనిట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.భాస్కర్ ఆధ్వర్యంలో శ్రావణ మా స బోనాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సంధర్భంగా శివ సత్తులు బోనాలను ఎత్తుకొని, పోత రాజుల డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, మహిళా ఉద్యోగిణులు బోనాలను ఎత్తుకొని, ఉద్యోగులు భారీ తొట్టెలను ఊరేగింపుగా వెళ్లి బంగారు మైసమ్మ ఆలయంలోని అమ్మవారికి బోనా లు ,తొట్టెలను సమర్పించారు. ఈ పూజల్లో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, డీఈవో ఆర్.రోహిణి, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం. ముజీబ్‌హుస్సేనీ, గ్రం ధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్నా రాంమూర్తి, డీఈవో జాయింట్ డైరెక్టర్ సరోజినిలతో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
కార్యక్రమంలో టీజీవో హైదరా బాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, టీజీవో నగర శాఖ అ ధ్యక్షుడు గండూరి వెంకట్, ఆర్‌జేడీఎస్‌ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు లక్ష్మీపతి రెడ్డి, సాయి పూర్ణచందర్రావు, సులోచన,రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సుకేషిని, డీఈవో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషన ర్ జూపల్లి నర్సింగ్‌రావు, టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ డేవిడ్, కోశాధికారి ఎస్డీ ప్రేమ్‌కుమార్, ఉపాధ్యక్షులు బి.రవి కుమార్, ఎ.రుగేశ్, సంయుక్త కార్యదర్శులు ఎంఏ ముక్తధర్, ఎండీ ఇషాక్ ఖాన్, కార్యనిర్వాహణ కార్యదర్శులు జయంతి రెడ్డి, ఫెరోజ్ అహ్మద్, ప్రచార కార్యదర్శి ఎం.వై.రవి, కార్యవర్గ సభ్యులు ప్రియాదేవ్ ఠాకూర్, ఖాజా మో హినుద్దీన్, మహ్మద్ ముజాహిద్ అలీ పాల్గొన్నారు.