దుండిగల్,ఆగస్టు24: వైద్యపరంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి నిజాంపేటలో ఎరుకుల ఆత్మగౌరవ భవనం శంకుస్థాపనకు ఆయన మరో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా దవాఖానలు సరిపోవడం లేదని, మరిన్ని బస్తీ దవాఖానలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో స్పందించిన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తోందని, ఈ నేపథ్యంలో నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో అదనంగా మరో 8 బస్తీ దవాఖానలు, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండు దవాఖానలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో సైతం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని కోరగా అక్కడసైతం మరో రెండు బస్తీ దవాఖానలు లేదా ఐదు పల్లె దవాఖానలను ఏర్పాటు చేయడంతో పాటు ఒక డాక్టర్‌ను అందుబాటులో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు.
ఇందు కోసం కమ్యూనిటీహాళ్లు లేదా స్థలాలు కేటాయిస్తే రానున్న రెండు, మూడు నెలల్లోనే వాటిని ప్రారంభిస్తామన్నారు. దీంతో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో పాటు మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ ఎరుకల సంఘం ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ,ఎరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కే.శ్రీశైలం, స్థానిక కార్పొరేటర్ కొలన్ మీనాసునీల్రెడ్డి, నిజాంపేట కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్‌రెడ్డి, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్‌నాయక్, నిజాంపేట కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు,కో-అప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.