చంపాపేట, ఆగస్టు 24: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. చంపాపేట డివిజన్ పరిధి కటికోనికుంటలోని ప్రభుత్వ స్థలం చుట్టూ, న్యూ మారుతీనగర్‌లోని పార్కు స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్, మాధవనగర్ కాలనీలోని శ్మశాన వాటిక చుట్టూ రూ.73లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం, మాధవనగర్ కాలనీలో రూ.68లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గతంలో పలు కాలనీల్లో, బస్తీల్లో ప్రారంభించిన నాలాల నిర్మాణం, పలు అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వచ్చిన ఇబ్బందులే ఇందుకు కారణమని తెలిపారు.
త్వరలో అన్ని పనులు పూర్తి అయ్యేటట్లు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ మహ్మద్ రఫీక్, ఏఈ జాన్, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్త చేగోని మల్లేశ్ గౌడ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమా చారి, టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్ రెడ్డి, డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, మహిళా వింగ్ అధ్యక్షురాలు శాగ రోజారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గోకుల్ సరోజ, గౌని అనుసూయ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గజ్జెల మదుసూధన్‌రెడ్డి, నల్ల రఘుమారెడ్డి, నాయకులు అంజిరెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు చీర శ్రీనివాస్, నిష్కాంత్ రెడ్డి, లక్ష్మి, కాలనీవాసులు మణిపాల్‌రెడ్డి, సాంబమూర్తి, శేఖర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, యాదగిరి, రమాదేవి, ఉషా, రజిని, విజయలక్ష్మి, వసంతరెడ్డి, కట్ట వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్, ఆగస్టు 24: రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. బుధవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమ కారులు, ఆయా డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా విభాగం అధ్యక్షురాళ్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
మన్సూరాబాద్, ఆగస్టు 24: కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాలపై ఆధారపడకుండా తమ సొంత నిధులతో కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హిమపురికాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ సొంత నిధులు రూ.4లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం షెడ్డును బుధవారం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
హార్టికల్చర్ విభాగం వారు ఇష్టానుసారంగా ఆట స్థలాల్లో చెట్లను నాటడం సరైంది కాదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. మధ్యలో ఉన్న ఆటస్థలాలను యథావిధిగా వదిలి ప్రహరీగోడ పక్కన చెట్లను నాటాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్‌యాదవ్, నాయకులు దుర్గెంపూడి సాంబిరెడ్డి, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్న కురుమ, పండుగ కరుణాకర్, సిద్దగౌని జగదీశ్‌గౌడ్, ఏర్పుల యాదయ్య, భాస్కర్‌యాదవ్, నగేశ్ యాదవ్, కాలనీ అధ్యక్షుడు కె.వెంకటాచార్యులు, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట రమణాచార్యులు, గౌరవ అధ్యక్షుడు దత్తంరెడ్డి, కోశాధికారి కిరణ్, కాలనీవాసులు సంతోష్‌కుమార్ గుప్తా, బద్రీనాథ్, రమేశ్, మాధవి, ధనలక్ష్మి, సావిత్రమ్మ, సునీత, సువర్ణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.