గౌతంనగర్, ఆగస్టు 24: సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకుపోతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్, భరత్‌నగర్ చౌరస్తాలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ పోల్స్, కమ్యూనిటీహాల్స్, మంచినీరు, వాటర్ లీకేజీలు, పింఛన్లు, తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టి కి తీసుకవచ్చారు. అలాగే.. భరత్‌నగర్ బస్తీవాసులు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డైనేజీ వ్యవస్థ బాగులేదని వివరించగా.. వెంటనే ఎమ్మెల్యే.. జోనల్ కమిషనర్ నుం చి రూ.2కోట్ల నిధులను మంజూరు చేయించారు.
షఫీనగర్, సాదుల్లానగర్‌లో గురువారం పర్యటించి డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ప్రజా దర్బార్’లో సమస్యలను పరిష్కరిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామని, కలిసివచ్చే వారితో పనిచేస్తామన్నారు. దాదాపుగా రెండు నెలల్లో మౌలాలి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ.8కోట్ల పనులు చేపట్టామని తెలిపారు. తెలంగాణలో 10లక్షల మందికి పింఛన్లు మంజూరు కాగా.. అందులో మల్కాజిగిరి నియోజకవర్గంలో 6,608మందికి మంజూరయ్యాయని తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమానికే పాటుపడుతున్నారని తెలిపారు.
‘ప్రజాదర్బార్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ప్రత్యే క నిధులు మంజూరు చేయించి.. పనులు చేపడుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును స్థానికులు అభినందించారు. యేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కమాన్, ఆర్యూబీ సమస్యలను పరిష్కరించారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీ రాజు, ఈఈ లక్ష్మ ణ్, జీఎం సునీల్‌కుమార్, డీఈ మహేశ్, ఏఈ మధురిమ, డీసీపీ గజానంద్, కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మీనా ఉపేందర్‌రెడ్డి, మేకల సునీతారాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, సతీశ్‌కుమా ర్, పిట్ల శ్రీనివాస్, మేకల రాముయాదవ్, నిరంజన్, భాగ్యనందరావు, మౌలాలి డివిజన్ అధ్యక్షుడు సత్తయ్య, మంద భాస్కర్, ఎండీ సాధిక్, ఎస్ఆర్ ప్రసా ద్, ఆదినారాయణ, సంతోష్నాయుడు, టీఆర్ఎస్కేవీ ఉస్మాన్, చందు, మోహన్‌రెడ్డి, సంతోశ్రాందాస్, గౌలిక ర్ శైలేందర్, గౌలికర్ దినేశ్, జాన్‌బీ, ఖాసింబీ, మదర్, వివిధ కాలనీ, బస్తీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.