రవీంద్రభారతి, ఆగస్టు 22: ఓసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఓసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24న చేపట్టిన ఛలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య నాయకులు తెలిపారు. సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్యార్టర్స్‌లో ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆధ్వర్యంలో ఐకాస రాష్ట్ర నాయకులు కలిశారు.
ఓసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుపై మంత్రి దయాకర్‌రావు, వినోద్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం కేసీఆర్ వద్దకు ఓసీ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందాన్ని వారంలోగా స్వయంగా తీసుకువెళ్లి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తామంటూ వారు హామీ ఇచ్చారని సంఘాల ప్రతినిధులు తెలిపారు.
అనంతరం ఓసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు రాసిన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి దయాకర్‌రావు, వినోద్‌కుమార్‌కు అందజేసినట్లు పోలాడి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహా రెడ్డి, పి. రాజిరెడ్డి, పి.కేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జున్నూతుల రాజిరెడ్డి, రెడ్డి జాగృతి అధ్యక్షులు బుట్టం మాధవరెడ్డి, టి.పశుపతి, బుస్సా శ్రీనివాస్, వెలమ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెన్నమనేని పురుషోత్తం రావు, బ్రాహ్మణ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దీపక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.