పనులు చేపడుతున్నామని తెలిపిన ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
పారిశుధ్య పనులు వేగవంతం
చర్లపల్లి, ఫిబ్రవరి 25 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజ్న్ పరిధిలోని శ్రీ పద్మావతి కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించి స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాళీ స్థలాలను పరిరక్షించి, పార్కులుగా తీర్చిదిద్దడంతో పాటు ఓపెన్ జీఎంలను ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. పారిశుధ్య పనులను వేగవంతం చేస్తున్నామన్నారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, ఏఎస్రావు నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, నాయకులు ఎంపెల్లి పద్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌రెడ్డి, గంప కృష్ణ, సారా వినోద్, విజయ్, ఉపేందర్ పాల్గొన్నారు.
ఇందిరా గృహ కల్ప ఇండ్ల మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు
ఇందిరా గృహ కల్ప ఇండ్ల మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరా గృహ కల్ప కాలనీవాసులు శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యేను కలిసి ఇండ్ల మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు మరమ్మతు పనులను త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పనుల విషయం ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కాలనీకి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు విధి దీపాల నిర్వహణ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, నాయకులు ఎంపెల్లి పద్మారెడ్డి, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు రోశయ్య, భాస్కర్‌గౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కార చర్యలు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై సమీక్ష
ఉప్పల్ ప్రాంతానికి దశ – దిశను తీసుకువచ్చే విధంగా కృషిచేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప్పల్‌లో చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫీర్జాదీగూడ – రామంతాపూర్ను కలుపుతూ ఫ్లై ఓవర్‌తోపాటు, ఉప్పల్ చౌరస్తాకు సమీపంలో ఇంటర్నల్ రోడ్లను కలుపుతూ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. దీనితో ఉప్పల్‌లో ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించవచ్చన్నారు. ఈ నిర్మాణం ఉప్పల్‌కు ఐకాన్‌గా మారనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ రోహిణి, డీఈ రవీందర్ పాల్గొన్నారు.