బండ్లగూడ/ శంషాబాద్ రూరల్, ఆగస్టు 22: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓమౌజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్, విజ్ఞాన్ కళాశాలల యాజమాన్యం సంయుక్తంగా ఏర్పాటు చేసిన 75 మీటర్ల జాతీయ జెండాతో బండ్లగూడలో ఫ్రీడం ర్యాలీని నిర్వహించారు.
దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి నార్సింగి ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. 500 మంది విద్యార్థులతో కలిసి సుమారు మూడు కిలోమీటర్ల మేర గంటన్నర పాటు ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఐఏయూవైఎస్ఏ అధ్యక్షుడు తిరుమల ఋషి, కార్యదర్శి మహేందర్ సిబ్బందిపాల్గొన్నారు.
వజ్రోత్సవాలు ముగింపు సందర్భంగా మం డలంలోని పాలమాకులలోని ఆదర్శ పాఠశాలలో సైన్స్ టీచర్ మాధవి ఏర్పాటు చేసిన 150 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. పాలమాకుల గ్రామ సర్పంచ్ సుష్మాగౌడ్ మాట్లాడుతూ జాతీయ జెండాతో ర్యాలీ తీయడంతో విద్యార్థుల్లో దేశ భక్తి పెం పొం దుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చే య డంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న ఉ పాధ్యా యురాలిని ఆమె అభినందించారు.