చిక్కడపల్లి, ఆగస్టు 22: సీఎం కేసీఆర్ విద్యకు పెద్ద పీట వేశారని జీహెచ్ఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ రెసిడెన్సియల్ బాలకల గురుకుల పాఠశాలలో సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు వి.సమాతారెడ్డితో కలిసి వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతాలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శైలజ, టీచర్లు, ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు నాయిని దేవేందర్, టీఆర్ఎస్ నాయకులు సిరిగిరి కిరణ్‌కుమార్, శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.
నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు వి.సమతారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్స్ బుక్స్, జామెంట్రిబాక్స్లు పంపిణీ చేశారు. అదే విధంగా పదో తరగతిలో టాపర్‌గా నిలిచిన వారికి రూ.25 వేల బహుమతిని అందజేస్తామని సమతారెడ్డి ప్రకటించారు.
కవాడిగూడ, ఆగస్టు 22: విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇంగ్లిష్ యూనియన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ పి.స్వర్ణలత పేర్కొన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం కవాడిగూడలోని ఇంగ్లిష్ యూనియన్ స్కూల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ, ఆగస్టు 22: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ముషీరాబాద్ విద్యామండలి పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వాలీబాల్, ఖోఖో తదితర పోటీల్లో సెయింట్ పాయిస్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ లిండా సోమవారం జ్ఞాపికలను అందజేసి అభినందించారు. పీఈటీలు విజయరాణి, సిద్ధేశ్వర్, సామ్యూల్‌ను ఘనంగా సత్కరించారు.