చిక్కడపల్లి, ఆగస్టు 22: పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో రూ.42.90 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జీమ్, పిల్లల ఆట పరికరాలు, షెటిల్, బ్యాట్మింటన్ కోర్టులను సోమవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ రవిచారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ప్రతిరోజూ నడక, వ్యాయామం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. వాకర్స్ తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
జీహెచ్ఎంసీ డీఈ గీత, సీనియర్ వాకర్ వెంకటకృష్ణ(బబ్లూ), వాకర్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాండయ్య, సంతోష్ గౌడ్, కోశాధికారి రమేశ్ రెడ్డి, ఎంఎన్ రావు, టీఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.మోజస్, మన్నే దామోదర్‌రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, తెలంగాణ హౌస్‌ఫెడ్ డైరెక్టర్ కిషన్ రావు, ఎంవీ జనార్దన్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఆర్.వివేక్, జయదేవ్, శివకుమార్ యాదవ్, ముదిగొండ మురళి, టెంపుల్ జనార్దన్, కూరగాయల శ్రీను, వాకర్స్ భగత్, శైలాజ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎనిమిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. సోమవారం ఎల్బీస్టేడియంలో జరిగిన స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి రాంనగర్ చౌరస్తా నుంచి పెద్దఎత్తున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తులు తరలివెళ్లారు. జెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో శక్తి వంతమైన రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
అన్ని రంగాల్లో నేడు తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చుచేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు విజయవతంగా ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంనగర్, గాంధీనగర్, అడిక్‌మెట్, ముషీరాబాద్ డివిజన్ల అధ్యక్షులు ఆర్.మోజస్, రాకేశ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్ ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు మన్నే దామోదర్‌రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్ ముదిరాజ్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, అస్లం, శ్యామ్, చిట్టి, మాదవ్, ఎంవీ జనార్దన్, ఎస్టీ ప్రేమ్, కల్పన పాల్గొన్నారు.
కవాడిగూడ, ఆగస్టు 22: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. సోమవారం భోలక్‌పూర్ డివిజన్ దేవునితోటలోని శ్రీ భవానీ శంకర్ దేవాలయం ప్రాంగణంలో ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి కొనిదెల చిరంజీవి జన్మదినం సందర్భంగా కొనిదెల ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు ఆర్. మోజెస్‌తో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ మొక్కలు నాటారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు నాగరాజు, నాగేశ్, మెగా విజయ్, నరేశ్ గౌడ్, వరంగల్ శ్రీను, వరుణ్, వెంకట్, ప్రవీణ్, రవి, వెంకట్, బాబు తదితరులు పాల్గొన్నారు.