శామీర్‌పేట, ఆగస్టు 22 : గ్రామాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఇది తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్‌పేట మండలం ఉద్దెమర్రిలోని అక్కన్న మాదన్న ఆలయంలో వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, అలియాబాద్, శామీర్‌పేట గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచులు బాలమణి, కుమార్‌యాదవ్, ఎంపీటీసీలు అశోక్, సాయిబాబు, నాగరాజు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జహీరుద్దిన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, మండల మాజీ అధ్యక్షుడు విష్ణుగౌడ్, ప్రధాన కార్యదర్శి జగదీశ్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బల్‌రాంగౌడ్, పవన్ముదిరాజ్, గోపాల్, భూమేశ్ గౌడ్, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.