సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: ట్యాంక్‌బండ్‌పై సన్డే ఫన్ డే పేరుతో ప్రభుత్వం సందర్శకుల కోస ం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో నగర వాసులు కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ను ట్రాఫిక్ ఫ్రీగా మార్చడంతో పిల్లలతో కలిసి పెద్దలు సరదాగా గడిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్యాంక్‌బండ్ అదే థీమ్‌తో హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కళాకారులు, సంగీతకారులు వచ్చి తమ తమ ప్రతిభను ప్రదర్శించారు. పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రాత్రి పది గంటల వరకు వేడుకలు జరిగాయి. ఆరెస్ట్రా -తెలుగు పాటలు, ఒగ్గు డోలు, గుస్సాడి , బోనాలు కోలాటం, తినుబండారాలు, చేనేత, హస్తకళల ప్రదర్శనలు నిర్వహించారు.
చార్మినార్ వద్ద ఫుల్ జోష్…
పాతనగర శోభను.. సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శిస్తూ చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్యాంక్ బండ్ తరహాలోనే చార్మినార్ సాయంత్రం పెద్ద ఎత్తున సందడి నెలకొంది.షాపింగ్‌తో పాటు విందు,వినోదం, ఫుడ్‌జోన్, ఎంటర్టైన్మెంట్, స్టాండఫ్ కామెడీ డ్రామా వంటి కార్యక్రమాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.