సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తేతెలంగాణ): స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు జరగనున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సహకారంతో నియోజకవర్గంలో కనీసం 75 మంది తప్పనిసరిగా రక్తదానం చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తమిచ్చే వారిని ప్రోత్సహించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. కాగా 30 సర్కిళ్లలో 2150 మంది రక్తదాన శిబిరాల్లో పాల్గొననున్నారు.
మేడ్చల్ జిల్లాలో..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 5 చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఈ శిబిరాలు ఉంటాయని, మేడ్చల్ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.