చిక్కడపల్లి, ఆగస్టు 5 : పేదలకు ఆదుకునే శక్తి దేశంలో కేసీఆర్ ఒక్కరికే ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. సీఎం పేదలు, మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తులు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు రావులపాటి మోజస్ ఆధ్వర్యంలోబీజేపీ మైనారిటీ మోర్చా ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ మహమ్మద్ మొయిజ్ గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సెక్యూలర్ పార్టీ అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు, మైనార్టీలకు పెద్ద ఎత్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మన్నే దామోదర్‌రెడ్డి, డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అలందార్ ఉస్సేన్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, పార్టీ సీనియర్ నాయకు ముఠా నరేశ్, ప్రవీణ్ ముదిరాజ్, వాసు తదితరులు పాల్గొన్నారు.