హయత్‌నగర్, ఆగస్టు 3 : దేశంలోనే తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది సేవలు నంబర్ వన్ స్థానంలో ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన నూతన ఫైర్ స్టేషన్‌ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్‌ను కేటాయించినట్లు చెప్పారు. కార్యాక్రమంలో ఎమ్మెల్సీలు మల్లేశం, దయానంద్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, ఫైర్‌శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్ జైన్, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.