కొండాపూర్, జూలై 31: మాదాపూర్‌లో ఆదివారం నిర్వహించిన డాగథాన్కు విశేష స్పందన లభించింది. 27 శునకాలు, వాటి యజమానులు పాల్గొన్న ఈ రన్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టీ. శ్రీనివాస్‌రావు ప్రారంభించారు. సామాజిక బాధ్యతతో ఏడుగురు యువకులు విభాగ్ ఫౌండేషన్, ఎవ్రీ పావ్ మ్యాటర్స్, విశ్వాస్, అరాహ్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పది రోజుల్లో రూ. 10లక్షలను సేకరించడాన్ని ఆయన అభినందించారు. అనాథలు, వీధి కుక్కలు, మహిళలు, ట్రాన్స్జెండర్లను ఆదుకునేందుకు ఈ విరాళాలు సేకరించినట్లు చెప్పారు. 400కు పైగా రన్నర్లు, 27 శునకాలు పాల్గొన్న ఈ రన్లో స్కై సైబీరియన్ హస్కీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో అన్యజైన్, అష్మిత్ తైన్వాలా, అన్వేషణ గుప్తా, ఆషి పాండే, అర్షియా కుమార్, ప్రణవ్ వర్మ, శ్రేయాన్స్ కడియాల తదితరులు పాల్గొన్నారు.