మన్సూరాబాద్, జూలై 31: మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ల పరిధిలో ఆదివారం బోనాల ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మన్సూరాబాద్ ఆగమయ్యకాలనీ, చింతలకుంట, నాగోల్ డివిజన్ బండ్లగూడలోని పోచమ్మ దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, మహంకాళి దేవాలయంలో ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, చెరుకు సంగీత, డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, తూర్పాటి చిరంజీవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగమయ్య కాలనీ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పండుగ కరుణాకర్ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, కార్పొరేటర్లు చింతల అరుణ, కొప్పుల నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి తదితరులు ఆయా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో కర్మన్‌ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, మాజీ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్‌యాదవ్, టంగుటూరి నాగరాజు, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్న కురుమ, అత్తాపురం రాంచంద్రారెడ్డి, చెంగల్ చంద్రమోహన్, తూర్పాటి కృష్ణ, తూర్పాటి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా బోనాల ఉత్సవాలు
వనస్థలిపురం, జూలై 31: సాహెబ్‌నగర్ పోచమ్మ, ఎల్లమ్మ దేవాలయంలో చైర్మన్ గంగం శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ కుంట ఎల్లమ్మ దేవస్థానంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న, సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్ సీఐ మహేశ్‌గౌడ్ తదితరులు పూజలు నిర్వహించారు. అనంతవేణి కాలనీలోని పోచమ్మ ఆలయంలో చైర్మన్ బోడ శేఖర్ ఆనంద్ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దగౌని సతీశ్కుమార్గౌడ్ హాజరై పూజలు నిర్వహించారు. ఎన్జీవోస్ కాలనీ ఎల్లమ్మ దేవస్థానంలో చైర్మన్ వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హయత్‌నగర్‌లో బోనాల ఉత్సవాల సందర్భంగా డివిజన్లోని సత్యానగర్, శుభోదయనగర్, అంబేద్కర్‌నగర్, బాబూ జగ్జీవన్‌రామ్ కాలనీ, బంజారాకాలనీ, సుబ్రహ్మణ్యనగర్, బృందావన్ కాలనీ, అన్మగల్ హయత్‌నగర్‌లోని పోచమ్మ అమ్మవారి ఆలయాలను కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి, స్థానిక కాలనీ సంక్షేమ సంఘం, ఆలయ నిర్వాహకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామ రంగారెడ్డి, బండారి భాస్కర్, సత్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాడిగళ్ల శ్రీనివాస్, శుభోదయనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సారా శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
కర్మన్‌ఘాట్‌లో..
కర్మన్‌ఘాట్ పరిధి క్రాంతి క్లబ్ ఆవరణలోని ఈదమ్మ, నల్ల పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు ఎరుకల కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు ఎరుకల విశ్వనాథ్ గౌడ్, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్త చేగోని మల్లేశ్ గౌడ్, టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మాజీ ఏరియా కమిటీ సభ్యుడు జగదీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.