ఆర్కేపురం, జూలై 31: ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరలకే అందించేందుకు ఆసుపత్రి నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. కొత్తపేటలో పారమిత గ్రూప్స్ నూతనంగా ఏర్పాటు చేసిన మాతృ ఆసుపత్రిని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం వైద్య హబ్‌గా మారిందన్నారు. ప్రస్తుతం, హైదరాబాద్ నగరంలో ఎలాంటి జబ్బులకైనా చికిత్స ఇక్కడే చేస్తున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజలకు తక్కువ ధరలు నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారమిత చిల్డ్రన్ ఆసుపత్రి డైరెక్టర్ సతీశ్, చిలుక ఉపేందర్‌రెడ్డి, డా.ధనరాజు, డా.శ్రీనివాస్, దేప భాస్కర్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.