మెహిదీపట్నం జూలై 24;మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆదివారం గ్రేటర్‌వ్యాప్తంగా కోలాహలంగా సాగాయి. మంత్రి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు జోరుగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.‘గిఫ్ట్ఏ స్మైల్’ పేరుతో దివ్యాంగులకు వాహనాలు, మహిళలకు కుట్టుమిషన్లు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలతోపాటు అన్నదానాలు చేశారు. కామారెడ్డికి చెందిన రామకృష్ణ రవీంద్రభారతిలో 40 వేల నాణేలతో కేటీఆర్ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఇందుకోసం కళాకారులు 20 గంటలకుపైగా శ్రమించారు.మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అబ్దుల్ లీం నీలోఫర్ దవాఖానకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో
భాగంగా ఆక్సిజన్ సిలిండర్‌ను మెడికల్ ఆఫీసర్ హేమలతకు ఉచితంగా అందచేశారు.
గ్రామ పంచాయతీకి అంబులెన్స్ విరాళం
శామీర్‌పేట, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మూడుచింతపల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన గిరిపల్లి రమేశ్, దండు రాములు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా రూ.6.50 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ను గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ అంబులెన్స్‌ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గ్రామస్తులకు సేవ చేయాలనే సంకల్పంతో అంబులెన్స్‌ను సమకూర్చామని, గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్, శ్రీధర్‌రెడ్డి, మురళీగౌడ్, విష్ణు గౌడ్, శ్రీనివాస్, భిక్షపతి, వెంకటేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం..
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేస్తున్న టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి శ్రీకాంత్ గౌడ్. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
టీఎన్జీఓ గాంధీ దవాఖాన యూనిట్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ‘గాంధీ’ ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా టీఎన్జీఓ
నగర అధ్యక్షుడు ముజీబ్ హుస్సేన్, రాజ్‌కుమార్, శంకర్, శ్రీనివాస్, వైదిక్ హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, యాదిలాల్, విజయ్‌భాస్కర్, ఖలీల్,
శ్రవణ్‌కుమార్, సరళ, విజయలక్ష్మి, మసూద్, ప్రవీణ్, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుకు టీఎన్జీఓ
తరఫున బీపీ ఆపరేటర్లను విరాళంగా అందజేశారు.
మంత్రి కేటీఆర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
అబిడ్స్,జూలై 24: మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్ గోషామహల్ డివిజన్ పరిధిలోని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌సింగ్, నరేందర్ యాదవ్, శైలేశ్ కురుమ, క్రాంతి, సునీల్ సింగ్, శంకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ ఎల్బీనగర్ హస్తినాపురంలోని శ్రీకీర్తన ఫౌండేషన్‌లో అన్నదానం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎన్.శివాజీ, ప్రధానకార్యదర్శి రామేశ్వరయ్యశెట్టి, బందెల రవి, పున్నానాయక్ పాల్గొన్నారు. మరోవైపు.. తెలంగాణ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు సమీపంలోని రవి హిలియోస్ దవాఖానలో మెగా హెల్త్‌క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్, డాక్టర్ విజయ్‌భాస్కర్‌గౌడ్, మధు, సత్యం, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.