చిక్కడపల్లి, జూలై20 : ముఖ్యమంత్రి కేసీఆర్ అనస్థీషియా ఓటీ టెక్నీషియన్ల నియామక ప్రక్రియ తీసుకోవడం గొప్ప విషయం అని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ అనస్థీయా,ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీస్ట్(ఓటీ) అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ అనస్థీషియా, ఆపరేషన్ టెక్నాలజీస్ డే వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో అనస్థీషియా ఓటీ టెక్నీషియన్లకు ఇస్తున్న గుర్తింపు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10వేలకుపైగా వివిధ దవాఖానల్లో అనస్థీషియా ఓటి టెక్నీషియన్లుగా పని చేస్తున్నారని తెలిపారు. పారామెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికెట్లు పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సురేందర్ రెడ్డి, విజ్ఞాన్ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ ఎన్.గౌతం రావు, డాక్టర్ ఆవినాశ్ డాల్, డాక్టర్ బి.నరహరి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత కుమార్, రవీందర్ పటేల్, నాగరాజు, నాగమణి పాల్గొన్నారు.