కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 16 : దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యం నింపి అభ్యున్నతిని సాధించేలా ప్రభుత్వం చేయూతనందిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన 50 మందికి త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని రకాల చేయూతనందిస్తుందన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని.. మేథస్సుతో అన్ని రంగాల్లో సత్తాను చాటాలన్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, పగుడాల శిరీషాబాబురావు, సబీహాబేగం, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు బాబురావు, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫతేనగర్ డివిజన్‌కు చెందిన షన్ను తండ్రి బక్రిదుద్దీన్కు రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అనారోగ్యంతో వైద్యశాలలో చేరిన పేదలకు వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు.