ఉప్పల్, జూలై 16 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలతో పాటు మౌలిక వసతుల కల్ప నకు కృషి చేస్తున్నామన్నారు. కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను గుర్తిం చి, వాటికి తగిన పరిష్కార చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీడీపీ నిధులతో కాలనీల్లో మౌలిక సదుపాయాలతోపాటు, కాలనీల్లో కమ్యూనిటీహాల్స్ నిర్మాణం కోసం చేయూతనందిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. కార్య క్రమం లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, లేతాకుల రఘుపతిరెడ్డి, గడ్డం రవి, గరిక సుధాకర్, ఏదుల్ల కొండల్‌రెడ్డి, పిట్టల నరేశ్, పల్లె నర్సింగ్ రావు, కోకొండ జగన్, అల్లిబిల్లి మహేందర్, రాం రెడ్డి, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, రోషిరెడ్డి, ఓంకార్, సరిత, లక్ష్మి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
మల్లాపూర్, జూలై 16 : పర్యావరణ పరిరక్షణలో భా గంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సూచించారు. మల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కోటేశ్వరి భాను పుట్టిన రో జు సందర్భంగా శనివారం ఆయన భవానీనగర్ కాలనీ లో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
టీఆర్ఎస్ ఉద్యమనేత మృతికి సంతాపం ..
రామంతాపూర్, జూలై 16 : టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు గోసుల యాదగిరి అనారోగ్యంతో మృతి చెందారు. రామంతాపూర్ రాజేంద్రనగర్‌లో ఉన్న అత ని ఇంటికి శనివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతని కుటుం బ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేపాక కుమారస్వామి, గడ్డం రవికుమార్, రుద్రారం నర్సింహ, వేముల చిన్న, జేసీబీరాజు, బండారు వెంకట్రావు, దొడ్డి జంగయ్య, గొసుల మధు, శంకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
రెడ్డి సంఘం ప్రతినిధులు కూడా..
ఉప్పల్, జూలై 16 : హబ్సిగూడ డివిజన్ రెడ్డి అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిశారు. ఈమేరకు హబ్సిగూడలోని ఆయ న నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెడ్డి సం ఘం భవనం కోసం స్థలం కేటాయించేవిధంగా చూడాల ని కోరారు. రెడ్డి సంఘం అభ్యున్నతికి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, కొమ్మిడి మల్లారెడ్డి, మారం ప్రదీప్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రొం డ్ల దామోదర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రాంరెడ్డి, అరవింద్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.