అంబర్‌పేట, జూలై15: కరోనా మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బూస్టర్ డోస్‌ను ఇస్తుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా ఈ డోసును ఉచితంగా వేస్తారని చెప్పారు. నల్లకుంట తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలో శుక్రవారం కార్పొరేటర్ అమృతతో కలిసి మంత్రి బూస్టర్ డోస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఇంకా కనుమరుగు కాలేదని, కేసులు పెరుగుతున్నాయన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా.కాలేరు దీప్తిపటేల్, మాజీ కార్పొరేటర్లు వనం రమేష్, బి.వెంకటరెడ్డి, బీజేపీ హైద్రాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డా.ఎన్.గౌతంరావు, నాయకులు మధుసూధన్, శ్యాంరాజ్, బుచ్చిరెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.