అంబర్‌పేట, జూలై 15: దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఒక నిర్భయమైన స్వాతంత్ర సమరయోధురాలని, ధైర్యం, త్యాగానికి మారుపేరైన దుర్గాబాయ్ లేని లోటును మహిళలు ముందుకు వచ్చి పూర్తి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ 113వ జయంతిని పురస్కరించుకొని బాగ్‌అంబర్‌పేట డివిజన్, డీడీకాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వాటర్‌వర్క్స్ చౌరస్తాలో గల దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ విగ్రహానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా హక్కుల కోసం ఆనాడే ఆమె ఉద్యమించిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ మహిళలకు ఆమె ఎంతో సాధికారిత కల్పించారన్నారు. ఆమె ఆనాడు చేసిన ఆలోచననే నేటి ఎన్జీవోలు అని పేర్కొన్నారు.
దుర్గాబాయ్ సాధారణ మహిళా కాదని, స్వాతంత్రం రాకముందే మహిళా సాధికారికత గురించి మాట్లాడిన మొదటి వ్యక్తి అన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డా.ఎన్.గౌతంరావు, నాయకులు పి.గోవర్ధన్‌రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పి.విజయ్‌కుమార్, వీణాడిగ్గీకర్, సుబ్బారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, నితీశ్దేశ్పాండే, కరణ్‌రెడ్డి, పి.ఇంద్రారెడ్డి, డాక్టర్ హరిచరణ్, బీజేపీ నాయకులు సి.కృష్ణాగౌడ్, చుక్కజగన్, జె.బాల్‌రాజు, టీఆర్ఎస్ నాయకులు మిర్యాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.