దుండిగల్, జూలై 15 : పట్టణ ప్రగతిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని నిజాంపేట్ మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రగతినగర్‌లోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ శుక్రవారం కమిషనర్ వంశీకృష్ణతో కలిసి వివిధ విభాగాలకు చెందిన అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులు, త్వరలో చేపట్టాల్సిన పనులపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ వాటిని పూర్తి చేసే దిశగా పని చేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో 19, 15వ డివిజన్ల కార్పొరేటర్లు కాసాని సుధాకర్ ముదిరాజు, సుజాతతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ శంకర్‌లాల్, సిటీప్లానర్ శ్రీనివాస్ మేనేజర్ చంద్రప్రకాశ్, శానిటరీ ఇన్చార్జి వినోద్‌కుమార్, వాటర్‌వర్క్స్ అధికారి సాయిరామిరెడ్డి, హార్టికల్చర్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, హరితహారం తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.