సిటీబ్యూరో, జూలై 14(నమస్తే తెలంగాణ): గిఫ్ట్ బాక్సులు, గ్రీస్ డబ్బాల్లో (హాషిష్ ఆయిల్) స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు నిందితులను బుధవారం రాచకొండ ఎస్ఓటీ ఎల్బీనగర్ బృందం అరెస్టు చేసింది. సీపీ మహేశ్‌భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని మాడ్గుల మండలం జంపెన గ్రామానికి చెందిన కోణ శివ, పప్పు నూకరాజు స్నేహితులు. ఇద్దరూ వంటలు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. వీరికి సంతోష్ కుమార్, సంజీవరావు పరిచయమయ్యారు. హైదరాబాద్‌లో హాషిష్ ఆయిల్ డెలివరీ చేస్తే ట్రిప్పుకు రూ.40వేలు ఇస్తామని చెప్పడంతో ఒప్పుకున్నారు. ఈ నెల 13న కోణ శివ, నూకరాజుకు నాలుగు లీటర్ల హాషిష్ అయిల్ను అప్పజెప్పారు. హయత్‌నగర్‌లోని భాగ్యలత కమాన్ దగ్గరకు చేరుకున్న తర్వాత ఫోన్ చేయాలని సూచించారు. సమాHyderabad News, Hyderabad District News చారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు శివ, నూకరాజును అరెస్టు చేసి రూ.15లక్షల విలువ చేసే హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సరఫరాదారులు పరారీలో ఉండగా, హయత్‌నగర్‌లో డెలివరీ తీసుకునేది ఎవరని తెలియాల్సి ఉన్నది. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, ఎస్ఓటీ డీసీపీ మురళిధర్, పాల్గొన్నారు.
గ్రీసు జిగురులో చెయ్యి పెట్టరని..
పోలీసుల దృష్టిని మళ్లించేందుకు హాషిష్ అయిల్ సరఫరాదారులు సంజీవరావు, సంతోష్‌కుమార్‌లు సరికొత్త పద్ధతులను ఎంచుకున్నారు. పోలీసులు గుర్తుపట్టకుండా, తనిఖీ సమయంలో చెయ్యిపెట్టరనే ఉద్దేశంతో గ్రీసు డబ్బాలో హాషిష్ ఆయిల్‌ను సరఫరా చేస్తున్నారు. దీని కోసం ఐదు లీటర్ల గ్రీస్ డబ్బాను కొనుగోలు చేశారు. హాషిష్ ఆయిల్ డబ్బాలను ప్లాస్టిక్ పేపర్లో చుట్టి గ్రీస్ డబ్బా అడుగు భాగంలో పెట్టి దాని పైన గ్రీసు కప్పేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే గ్రీసు మాత్రమే కనిపిస్తుంది. అంతేకాకుండా గిఫ్ట్ ప్యాక్‌లో హాషిష్ ఆయిల్ నింపిన డబ్బాలను పెట్టి ప్యాక్ చేసి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.