సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ)/మియాపూర్: వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. రెండోరోజు గురువారం ఉదయం మియాపూర్లోని ఎంఏనగర్ బస్తీలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. నీటి సరఫరా జరుగుతున్న సమయంలోనే బస్తీ అంతా పర్యటించారు. తాగునీటి నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను అడిగి నీటి సరఫరా జరుగుతున్న తీరును ఆరా తీశారు. ఉచిత తాగునీటి పథకం అందుతోందా? బిల్లులు చెల్లిస్తున్నారా? అని బస్తీవాసులును అడగగా.. పథకం అందుతోందని, తాము నల్లా బిల్లులు చెల్లించడం లేదని వారు ఎండీకి సమాధానం ఇచ్చారు.
నీటి శుద్ధిపై ప్రజలకు అవగాహన
తాగునీరు సరఫరా అయ్యే సమయంలో కచ్చితంగా తాగునీటి నాణ్యతను పరీక్షించాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. క్లోరిన్ బిళ్లలను ఇంటింటికీ పంపిణీ చేసి, వాటిని వినియోగించి నీటిని శుద్ధి చేసుకునే తీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎంసీసీలో కలుషిత నీటిపైన ప్రజల నుంచి ఫిర్యాదులు కనుక అందితే వెంటనే పరిషరించాలని సూచించారు. సమస్య పరిషారం అయ్యే వరకు తాతాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని పేరొన్నారు.
పనుల్లో రక్షణ చర్యలు తప్పనిసరి
వర్షాల నేపథ్యంలో సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఎండీ ఆదేశించారు. ఇప్పటికే వర్షాకాల ముందస్తు ప్రణాళికలో భాగంగా మ్యాన్ హోల్లో పూడికతీత పనులు చేపట్టామని, ఇంకా ఎకడైనా మ్యాన్హోల్లు ఉప్పొంగితే వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. పనులు చేస్తున్నప్పుడు కచ్చితంగా సేఫ్టీ ప్రొటోకాల్ పాటించాలని, బారీకేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని దానకిశోర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ ఎంఏనగర్ బస్తీలోని ఇంకుడు గుంతల పునరుద్ధరణ పనులను పారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎం విజయారావు, జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయిచరిత, తదితరులు పాల్గొన్నారు.