ఘట్కేసర్,జూలై 14 : హరితహరం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 2లక్షల,68వేల మొక్కలు మున్సిపాలిటీలో నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పోచారం చైర్మన్ బి.కొండల్‌రెడ్డి తెలిపారు. 5వ వార్డు హన్మాన్ నగర్లో ఇంటింటికీ ఐదు మొక్కలను అధికారులు, సిబ్బందితో కలిసి చైర్మన్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత సంవత్సరంహరితహారంలో 1లక్షా,90వేల మొక్కలు లక్ష్యంగా పెట్టుకొని వంద శాతం విజయవంతం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ఖాళీ స్థలాలు, కొత్తగా ఏర్పడే కాలనీలు, రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని సూచించారు. కమిషనర్ సురేశ్, కౌన్సిలర్ రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
భోగారం , గోధుమకుంటలో…
కీసర, జూలై 14 : గ్రామంలోని లేఅవుట్ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నామని భోగారం సర్పంచ్ కవితాజైహింద్రెడ్డి, గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని భోగారం, గోధుమకుంట తదితర గ్రామాల్లోని పలు కాలనీల్లో ఉపాధిహామీ కూలీలతో గురువారం మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 14 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కౌన్సిలర్ గూడూరు సబిత ఆంజనేయులు గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు పరిధి… బ్రహ్మయ్య కాలనీ, ఈశ్వర్పురి కాలనీ, మామిళ్ల నారాయణ కాలనీ, ఎస్వీ నగర్ రోడ్డు నంబర్ 11తో పాటు వివిధ కాలనీల్లో ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను కౌన్సిలర్ పంపిణీ చేశారు. అనంతరం వివిధ కాలనీల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, మురుగు కాలువలను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత గూడూరు ఆంజనేయులు గౌడ్, మధు గౌడ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
కాచవానిసింగారం గ్రామంలో…
ఘట్కేసర్ రూరల్, జూలై 14: మండల పరిధిలోని కాచవానిసింగారంలో గురువారం సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం మొక్కలు నాటారు. పంచాయతీ పరిధిలోని ఇంటింటికీ తిరిగి ప్రజలకు హరితహారంపై అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఇంటింటికీ 6 మొక్కల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ విష్ణు గౌడ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.