కుత్బుల్లాపూర్, జూలై 14 : కోవిడ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడ్స్, ఇతర వాహనాలపై రోజుకు రూ.50ల అదనపు రుసుం పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల లారీ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం మేడ్చల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అసోసియేష న్వారు మాట్లాడారు. తెలంగా ణ ప్రభుత్వం లాక్డౌన్ తర్వాత లారీలకు, స్కూల్ బస్సులకు, ఇతర మినీలారీ గూడ్స్ వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున ఫిట్నెస్ చార్జీలు పెంచింది.. అయితే.. ఇది వాహనదారులకు పెనుభారంగా మారిందని గుర్తించిన సీఎం కేసీఆర్.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకుండా పెంచిన ఫిట్నెస్చార్జీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు అధిక మొత్తంలో చెల్లించిన వారికి ఇతర వెసులు బాటు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వాహనదారులు, అసోసియేషన్ ప్రతినిధులు, డ్రైవర్లు నగేశ్, జావిద్, అశ్విన్, నర్సింహులు, పాషా పాల్గొన్నారు.