సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) :నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై వర్షంనీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మూడు రోజులుగా చర్యలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. నగర ట్రాఫిక్ పోలీసులు 50 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ఉన్న పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు.
వాటర్ లాగింగ్ పాయింట్స్
సమన్వయంతో సమస్యల పరిష్కారం
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్‌రావు సారథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. దాదాపు 1000 మంది పోలీసు సిబ్బంది సిఫ్టుల వారీగా విధుల్లో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నారు.