సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఇన్‌ఫ్లో ఆధారంగా అప్రమత్తమైన జలమండలి అధికారులు ఆదివారం సాయంత్రం రెండు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువన మూసీకి నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం వరద నీటి ప్రవాహం పెరగడంతో నీటి విడుదలను మరింత పెంచారు. రెండు జలాశయాల నుంచి 894 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీలోకి వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.