సిటీబ్యూరో, జూలై 10(నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నారు. నీటి తొలగింపునకు ప్రత్యేకంగా 128 స్టాటిక్ బృందాలు రంగంలోకి దిగి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్నారు. సమస్య పరిష్కారానికి 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక డీఆర్ఎఫ్ బృందాలు అక్కడక్కడ విరిగిన పడిన చెట్లను తొలగిస్తున్నారు. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్ , యూబీడీ, డీఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సమన్వయంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడ్డ ముంపు, నీటి నిలువలు, నాలాల తక్షణ తాతాలిక మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు రెండు రోజులుగా వరద సహాయక చర్యలు చేపడుతున్నారు వర్షాల వల్ల ఏదైన సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040-2111 1111, 040-29555500 నంబరుకు ఫోన్ చేయాలని మేయర్ విజయలక్ష్మి నగరవాసులకు సూచించారు.
చార్మినార్ జోన్లో గల 6 సరిల్ పరిధిలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. 144 మందితో 36 బృందాలు ఇన్స్టంట్ రెస్పాండ్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. 4 డీఆర్ఎఫ్ టీమ్‌లు, ఇంజినీరింగ్, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, ఎన్ఫోర్స్మెంట్ ఇతర విభాగాల సిబ్బంది దాదాపు 35 ప్రదేశాలలో నీరు నిలిచిన ప్రాంతాలలో పర్యటించి వరద నీటి నివారణ చర్యలు చేపట్టారు.
ఖైరతాబాద్ జోన్లో సుమారు 45 ప్రాంతాల్లో నీటి నిలువలు, వరద ముంపు ప్రాంతాల్లో తొలగింపు పనులు చేపట్టారు. పడిపోయిన చెట్లను తొలగించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా
నివారణ, సహాయక చర్యలు తీసుకున్నారు.

రెండు రోజులుగా 48 ఫిర్యాదులను ఎన్ఫోర్స్మెంట్ విభాగం స్వీకరించింది. సంబంధిత ప్రదేశాలకు వెళ్లి చెట్లను తొలగించి ప్రజల ఇబ్బందులను తొలగించారు.సికింద్రాబాద్ జోన్లో జోనల్ కమిషనర్, డీసీలు,ఇంజినీరింగ్ శానిటేషన్, ఎన్ఫోర్స్మెంట్, డీఆర్ఎఫ్ విభాగం అధికారులు సిబ్బంది కలిసి 54 ప్రాంతాల్లో వరద ముంపు నివారణ చర్యలు చేపట్టారు. ఏడు చోట్ల విరిగిపోయిన చెట్లను తొలగించారు. 156 మందితో 32 బృందాలుగా ఏర్పడి, 325 వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని తక్షణ సహాయక చర్యలు చేపట్టినట్లు జోనల్ అధికారులు తెలిపారు.
గ్రేటర్‌పై ముసురు ముసుగు మైలార్‌దేవ్‌పల్లిలో 5.5 సెం.మీలు వర్షపాతం నమోదు
సిటీబ్కూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గ్రేటర్ తడిసి ముైద్దెంది. గ్రేటర్‌లోని రాజేంద్రనగర్ మండలంలోని మైలార్‌దేవ్‌పల్లి అత్యధికంగా 5.5సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. శివరాంపల్లిలో 3.9సెం.మీలు, రాజేంద్రనగర్‌లో 3.7సెం.మీలు, శాస్త్రిపురంలో 3.4సెం.మీలు, బహుదూర్‌పురాలో 2.6సెం.మీలు, గాజులరామారంలో 3.1 సెం.మీలు, చందులాల్ బరాదరిలో 3.0 సెం.మీలు, అత్తాపూర్, కందికల్ గేట్, జీడిమెట్లలో 2.7 సెం.మీలు, కాంచన్‌బాగ్, హఫీజ్‌పేట్, షాపూర్‌నగర్ 2.6 సెం. మీలు, ఈస్ట్ ఆనంద్‌బాగ్ 2.1సెం.మీలు, గోల్కొండ 2.0సెం.మీలు, హైదరాబాద్ యూనివర్సిటీ 1.9 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
అప్రమత్తంగా ఉన్నాం..
ఆదివారం రాత్రి, సోమవారం రోజంతా భారీ వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నగర పోలీసు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయంతో పనిచేయడంలో అప్రమత్తంగా ఉన్నాం. పాఠశాలలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులకు రెయిన్ కోట్లు, బూట్లు, తాళ్లు, పంపులు తదితర విపత్తు నిర్వహణ పరికరాలను సమకూర్చాం.
– నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇండ్లలోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడా నీరు నిలువకుండా చూడాలి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. కార్పొరేటర్లు డివిజన్లలో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి.
– మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్