ఎల్బీనగర్, జూలై 10: రాష్ట్ర కుమ్మరి ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ఉప్పల్ భగాయత్‌లో మూడెకరాల స్థలం, రూ.3 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ కేటాయించడం పట్ల రాష్ట్ర కుమ్మరి సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు నగరంలోని కర్మాన్‌ఘాట్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సంఘం ప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్ రావు, ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ మాట్లాడుతూ కుమ్మరి సంస్కృతికి అద్దం పట్టేలా భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కుమ్మరి ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాలాచారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సం ఘం నాయకులు, ట్రస్టు సభ్యులు మలికంటి వెంకన్న, డాక్టర్ రవిశంకర్, వీరబాబు, లక్ష్మీనారాయణ, రాచకొం డ కృష్ణయ్య, నర్సింహులు, ఎరిగిశెట్టి వీరయ్య, నిమ్మలూరి శ్రీనివాస్, నాగపురి నగేశ్, శంకరయ్య, కానుగుల కోటేశ్, అశోక్, వెంకటరమణ, కుమార్ పాల్గొన్నారు.