రామంతాపూర్, జూలై 10 : తీవ్రమైన వర్షాలతో రామంతాపూర్ పెద్దచెరువులోకి వరదనీరు చేరుతుండటంతో ఆదివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చెరువు నీటిని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదనీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు మోటారును బిగించి నీటిని బయటకు పంపుతున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెరువులోకి చేరుతున్న వరదనీటిని పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, డివిజన్ అధ్యక్షులు డాక్టర్ బివిచారి, సోమిరెడ్డి, బద్దం భాస్కర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, పల్లె నర్సింగ్‌రావు, నరేశ్, మధుసూదన్‌రెడ్డి, రవీందర్, అజిత్‌రెడ్డి,కాలనీ వాసులు పాల్గొన్నారు. అదేవిధంగా శాంతినగర్‌లో స్ట్రామ్ వాటర్‌లైన్ పడ్డారు పనులను ఆదివారం డీఈ నాగమణి, ఏఈ శ్వేత. డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు పరిశీలించారు. వరదనీరు బయటకు వెళ్లడంలేదని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండుమూడు రోజుల్లో పనులకు శాశ్వతంగా పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రాజు రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
విరిగిపడిన చెట్ల కొమ్మలు..
కాప్రాలో వరుసగా నాలుగవ రోజు ముసురు కొనసాగింది. అశోక్కాలనీ, మాధవపురి, వాయుపురి ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విద్యుత్‌లైన్లపై పడటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొన్నది. సైనిక్‌పురి ఏఈ నరేంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది వెంటనే కొమ్మలను తొలగించి రిస్టోరేషన్ పనులు చేపట్టారు.
బాక్స్డ్రైన్తో ముంపు సమస్య దూరం : ఎమ్మెల్యే మైనంపల్లి
అల్వాల్, జూలై 10 : రాజీ లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్రెడ్డితో కలిసి అల్వాల్ శ్రీబేకరీ వద్ద పూర్తయిన బాక్స్ డ్రైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాక్స్ డ్రైన్ నిర్మాణంతో ఈ వానకాలంలో ముంపు సమస్య తీరుతుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టామని చెప్పారు. నెల కిందట అల్వాల్ ప్రధాన రహదారిని మూసివేసి పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో రాకపోకలు తిరిగి ప్రారంభించారు. దీంతో వాహనాలు సాఫీగా రాకపోకలు సాగిస్తున్నాయి.