కార్వాన్, జూలై 9: అసాధారణ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ.. ఆశలు వదులుకున్న ఓ మహిళకు మెరుగైన చికిత్స అందించి.. ప్రాణప్రాయం తప్పించారు నానల్నగర్లోని ఆలివ్ దవాఖాన వైద్యులు. 35 ఏండ్ల మహిళకు అసాధారణ బ్లడ్ క్యాన్సర్ ఉంది. సరైన చికిత్స అందకపోవడంతో జీవితంపై చివరి ఆశతో కుటుంబసభ్యులు ఆమెను ఆలివ్ అసుపత్రిలోని కన్సల్టెంట్ మెడికల్, హెమటో ఆంకాలజిస్టు డాక్టర్ శిఖర్ కుమార్ను కలిశారు. పరిశీలించిన ఆయన..
ఆమె పీహెచ్+అక్యూట్ లింపోబ్లాస్టిక్ ల్యుకేమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అత్యుత్తమ ప్రణాళిక, సరైన చికిత్సను క్రమం తప్పకుండా అందిస్తే ఆమె జీవించే అవకాశాలున్నాయని భావించి.. కుటుంబసభ్యుల అంగీకారంతో ఆరు నెలలు కీమో థెరపి చేశారు. అనంతరం నోటి మాత్రల చికిత్సకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆర్ఎండీ నెగిటివ్ వచ్చింది. అసలే బతికే అవకాశాలు లేవనే పరిస్థితి నుంచి రోగిని సాధారణ జీవితం గడిపేలా తీసుకువచ్చామని, క్యాన్సర్ రోగం నయం కాదని బాధపడే వారితో పాటు వైద్యులకు సైతం ఈ చికిత్స కొత్త ఆశలు రేకెత్తించిందని డాక్టర్ శిఖర్ కుమార్ తెలిపారు.