మేడ్చల్ రూరల్, జూలై 9: గుం డ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్ లో శనివారం ‘స్వరామృతం’ పేరు తో సంగీత పోటీలను నిర్వహించారు. స్పైసెస్ పథకం కింద ఏఐసీటీఈ అందించిన ఆర్థిక సహకారం తో నిర్వహించిన పోటీల్లో 80 మంది ఔత్సాహికులు పాల్గొన్నా రు. విద్యార్థులు వివిధ భాషల్లో సినీ గీతాలను ఆలపించి, తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ లలిత శ్రీదేవి న్యాయ నిర్ణేతగా వ్యవహరించా రు. తుది రౌండ్లో మొదటి సంవత్సరం డేటా సైన్స్ విద్యార్థిని కుమారి ప్రమద్వరను ఎంపిక చేసి, ‘వాయిస్ ఆఫ్ ఎంఆర్ఈసీ’ పురస్కారంతో సత్కరించారు.
ఎం.టెక్ విద్యార్థి వేణుగోపాల్, ఏఐఎంఎల్ విద్యార్థి శ్రీచరణ్ తర్వాత స్థానాల్లో నిలిచారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ రామస్వామి రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢ ప్రతిభను వెలికితీసి, గాత్ర మాధుర్యాన్ని అందరికీ పరిచయం చేయాలన్న సం కల్పంతో సంగీత పోటీలను నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ అసోసియేషన్ సమన్వయకర్తలు సరోజ, డాక్టర్ సంధ్యారాణి, బాలాజీ కృష్ణ, మ్యూజికల్ క్లబ్ సమన్వయ కర్త మానస, డీన్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.