సిటీబ్యూరో, జూలై 9(నమస్తే తెలంగాణ): జంట నగరాలలో తిరిగే 17 ఎంఎంటీఎస్ (లోకల్ రైలు) సర్వీసులను ఈ నెల 10, ఆదివారం నాడు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు శనివారం వెల్లడించారు. కొన్ని రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ బ్లాక్ వంటి కారణాల వల్ల లోకల్ సర్వీసులను రద్దు చేస్తున్నామన్నా రు. ఫలక్నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్యలో 13 సర్వీసులు, రామచంద్రాపురం -ఫలక్నుమా స్టేషన్ల మధ్య రెండు సర్వీసులు, ఫలక్నుమా-హైదరాబాద్ స్టేషన్ల మధ్య రెండు చొప్పున సర్వీసులను రద్దు చేశామన్నారు. అలాగే, ఇప్పటికే 34 ఎం ఎంటీఎస్ రైళ్ల రాకపోకలు ఆదివారం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
మల్కాజిగిరి -జల్నా స్టేషన్ల మధ్య రెండు స్పెషల్ రైళ్లు: మల్కాజిగిరి-జల్నా రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్ల రాకపోకలు శనివారం నుంచి ప్రారంభించారు.
‘విజయవాడ – గుంటూరు’ వేళల్లో మార్పులు: విజయవాడ-గుంటూరు స్టేషన్ల మ ధ్య నడుస్తున్న రెండు రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చేస్తున్నట్టు రైల్వే అధికారు లు నిర్ణయించారు. ఈ మేరకు కొత్త టైం టేబుల్ విడుదల చేశారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్సీఆర్ వెబ్సైట్లో పొందుపర్చారు.