సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): శుక్రవారం గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మాదాపూర్‌లో 5.2 సెం.మీ, రామంతాపూర్‌లో 4.6 సెం.మీ, హఫీజ్ పేటలో 4.5 సెం.మీ, డబీల్పురలో 4.3సెం.మీ, సీతాఫల్మండిలో 4.2సెం.మీ, మాదాపూర్‌లో 4.1 సెం.మీ, ఆర్సీపురం, శ్రీనగర్‌కాలనీ 3.9సెం.మీ, ముషీరాబాద్, మొండామార్కెట్, హబ్సిగూడ, నారాయణగూడలో 3.7 సెం.మీ, రామచంద్రాపురంలో 3.0సెం.మీ, షేక్‌పేట్‌లో 2.9 సెం.మీ, చార్మినార్, ఖైరతాబాద్‌లో 2.9సెం.మీ, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, బోరబండలో 2.7సెం.మీ, అంబర్పేట్, మారెడుపల్లిలో 2.6సెం.మీ, నాగోల్ బండ్లగూడ, మూసాపేట్, పాతబస్తీ సర్దార్మహల్లో 2.5సెం.మీ, ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్‌లో 2.3సెం.మీ, అమీర్‌పేట్, గచ్చిబౌలి, సరూర్‌నగర్‌లో 2.2సెం.మీ, సైదాబాద్, హబ్సిగూడ, సరూర్‌నగర్, అల్కాపురికాలనీ, కాప్రా, యూసుఫ్‌గూడ ప్రాంతా ల్లో 2.0 సెం.మీ, నాంపల్లి, మెహిదీపట్నం, మల్కాజిగిరి, టోలీచౌకి, బహుదూర్‌పురా, జియాగూడ ప్రాంతాల్లో 1.9సెం.మీ, హయత్‌నగర్, రాయదుర్గ, మౌలాలి, కుత్బుల్లాపూర్, కాంచన్‌బాగ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మేయర్ ప్రజలకు సూచించారు. ఏవైన సమస్యలు ఎదురైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 040-21111111 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
రాగల రెండు రోజులు అతి భారీ వర్ష సూచన
ఉపరితల ఆవర్తనానికి తోడు షియర్‌జోన్ ఏర్పడటం, రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గ్రేటర్‌కు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది.