కందుకూరు, జూలై 8 : అభివృద్ధి.. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జైత్వారం గ్రామంలో రూ.45లక్షలతో, అన్నోజిగూడ గ్రామంలో రూ.1.50కోట్లతో, మీర్ఖాన్పేట్ గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించే వివిధ అభివృద్ధి పనులకు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్పన్ తీగల అనితారెడ్డితో కలిసి భారీ వర్షాన్ని సైతం లెక్కలేయకుండా శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయని వివరించారు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ యార్డు చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఎర్రబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి, కాకి ఇందిరమ్మ దశరథ, జ్యోతి, భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ రాములు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నే జయేందర్ ముదిరాజ్, కాకి దశరథ, దామోదర్‌గౌడ్, లక్ష్మీనర్సింహారెడ్డి, డైరెక్టర్లు సామ ప్రకాశ్‌రెడ్డి, ఆనంద్, పారిజాతం, చిర్ర సాయిలు, నర్సింహ, సామయ్య, రైతు విభాగం మండల అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తిక్, కొలను విజ్ఞేశ్వర్‌రెడ్డి, బొక్క దీక్షిత్‌రెడ్డి, రామకృష్ణ, ప్రశాంత్‌చారి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, జయమ్మ రాజు, సిద్ధుగౌడ్తో పాట వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరికలు ..
అన్నోజిగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెదిన వార్డు సభ్యులు అంజయ్య, సంతోష, గణేశ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కొత్తగూడ ప్రభుత్వ పాఠశాల తనిఖీ..
మండల పరిధిలోని కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైత్వారం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తక్షణమే నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సాధ మల్లారెడ్డిని ఆదేశించారు. ప్రహరీ గోడ, నూతన గదుల మంజూరు, విద్యుత్ వంటి సమస్యలు పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని మాట్లారెడ్డి మంత్రిని కోరారు.