దుండిగల్/జీడిమెట్ల,జూలై 8 : విద్యార్థులు లక్ష్యాన్ని పెట్టుకుని పట్టుదలతో కష్టపడి చదివితే తమ గమ్యాన్ని చేరుకోవచ్చని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి, గాంధీనగర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను విని చదువులో ఉత్తమ ప్రతిభను కనబరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు బి.విజయ్‌శేఖర్‌గౌడ్, రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్‌రెడ్డి, భౌరంపేట పీఎసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, దుండిగల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, సుందర్రావు, టీఆర్ఎస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు సోమేశ్ యాదవ్, డివిజన్ల అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, విజయ్రామిరెడ్డి, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు జీమ్మి దేవేందర్, పోలీస్ గోవింద్‌రెడ్డి, మురళీ యాదవ్, నర్సింహారెడ్డి, చిలుక సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్‌గాంధీనగర్ పాఠశాలలో..
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌లోని ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు శుక్రవారం నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలోనిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ ఆగంపాండు, కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్‌రెడ్డి, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్గోపాల్రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
దుండిగల్,జూలై8: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తున్నానని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. నియోజకవర్గం పరిధిలో పలుప్రాంతాలకు చెందిన ప్రజలు, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, సంక్షేమసంఘాల ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ ఆగంపాండు, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నేతలు నూనే సాయి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
ఆహ్వానం..
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈనెల 10వ జరుగనున్న శ్రీ రేణుకాఎల్లమ్మ తల్లి ఆలయం పంచమ వార్షిక వేడుకల్లో పాల్గొనాలంటూ బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానపత్రం అందజేశారు.