సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై 6వ తేదీ వరకు మద్యం సేవించి వాహనాలు నడిపిన 7679 మంది వాహనదారుడు ట్రాఫిక్ పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారు. పోలీసులకు దొరికిన మందు బాబులను ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల డివిజన్లోని 8 ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో 7166 వాహనదారులను వివిధ స్థానిక కోర్టులలో హాజరుపర్చగా న్యాయమూర్తులు 1.76 కోట్లు జరిమానాలను విధించారు. పరిమితికి మించి మద్యం సేవించి ప్రమాదకరమైన స్థాయిలో వాహనాలను నడిపిన 237 మందికి జైలు శిక్షను విధించారు.