ఉప్పల్, జూలై 7 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్‌ను ప్రజల పాలిట గుదిబండగా మార్చిందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. వంట గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం మరో రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ గురువారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నాచారం కార్పొరేటర్ శాంతిసాయి జెన్ శేఖర్ ఆధ్వర్యంలో నాచారం ప్రధాన రహదారిలో నిరస న కార్యక్రమం చేపట్టారు. పొయ్యిరాళ్లకు బదులు ఖాళీ మూడు గ్యాస్ సిలిండర్లతో కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి వంట చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిం డర్ ధరను రూ.1105లకు పెంచడం దారుణమన్నారు. దేశంలో గ్యాస్‌ను కొనలేని స్థితికి బీజేపీ ప్రభుత్వం తీసుకువ చ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, కట్ట బుచ్చన్న గౌడ్, కాటేపల్లి రవీందర్‌రెడ్డి, రెబల్ రాజు, దాసరి కర్ణ, రాంచందర్, మంగోలు శివ, భూపాల్‌రెడ్డి, ఎర్రం శ్రీని వాస్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీరామ్ సత్యనారాయణ, రాజబాబు, వాసు, తిరుమల అశోక్, చంద్రశేఖర్, రఫిక్, శివకుమార్ , తదితరులు పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని కోరుతూ ఉప్పల్ సర్కిల్ దేవేందర్‌నగర్‌కాలనీలో మహిళలు ఖాళీ సిలిండర్లతో ధర్నా చేశారు. పట్టణం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూ పేదలకు గ్యాస్‌ను భారంగా మార్చిందని అన్నారు. నిత్యావసర ధరలు పెంచడంతో పేద, మధ్యతరగతి కుటుం బాలు రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎర్రం శ్రీనివాస్, ప్రపూర్ణ, కృష్ణ, లక్ష్మి, దేవమ్మ, సులోచన, ఉషారాణి, మాధవి, కౌసల్య, వినోజ, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, జూలై 7 : కేంద్రం మరోసారి వంట గ్యాస్ ధర రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ గురువారం ఓల్డ్ మల్లాపూర్ జీహెచ్ఎంసీ మైదానం ముందు కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు గ్యాస్ సిలిండర్లతో, మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో మహిళలు అండాలు, కోటేశ్వరి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉప్పల్ సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మల్లాపూర్‌లో వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు దామోదర్‌రెడ్డి మాట్లాడు తూ.. ఇప్పటికే డీజిల్, పెట్రోలు ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతు న్నారని.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వంట గ్యాస్ ధర పెంచడంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. కార్యక్ర మంలో ఉప్పల్ సీపీఐ మండల కార్యదర్శి రామ్‌నారాయణ, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు నర్సింహ, సుగుణ, స్వామిదాస్, సత్యప్రసాద్, జాన్, భిక్షపతి, క్రిష్ణ, బుచ్చిరెడ్డి, రాజేందర్, బషీర్, జంగారెడ్డి, కాంతయ్య, కుమార్, తదితరులు పాల్గొన్నారు.