మేడ్చల్, జూలై 7(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారంలో త్వరలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ (పారిశ్రామికవాడ)కు సం బంధించిన భూమిని టీఎస్ఐఐసీ బదాలయింపు పక్రియ ప్రారంభమైంది. తలకు రూ.32 లక్షల చొప్పున అందజేశారు. దీంతో ఇండస్ట్రియల్ ఏర్పాటుకు టీఎస్ఐఐసీకి బదాలయింపు పక్రియను రెండు మూడు రోజులలో పూర్తి చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. 171 ఎకరాల విస్తీర్ణంలో వందలాది పరిశ్రమలు ఏర్పడే విధంగా ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.
మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్న టీఎస్ఐఐసీ నిర్ధారించిన మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సేకరణ చేసి రైతులకు భూ పరిహారం పంపిణీని పూర్తి చేశారు. అయితే, రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లా పరిశ్రమల ఏర్పాటులో నెంబర్‌వన్ స్థానంలో ఉందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. చిన్న, స్మూక్ష మధ్య తరహా, భారీ పరిశ్రమలు మొత్తం 9,274 వరకు ఉన్నట్టు పేర్కొన్నారు.