తెలుగు యూనివర్సిటీ, జూలై 7: తెలుగు సాహిత్య ప్రక్రియల ద్వారా నిబద్దతతో సమాజాన్ని జాగృతం చేస్తున్న రచయితలను గుర్తించి సత్కరించడం ముదావహమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో 2019 వ సంవత్సరానికి గాను తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాల ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం గురువారం వర్సి టీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. యూనివర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య టి.కిషన్ రావు అధ్యక్షోపన్యాసం లో పురస్కార గ్రహీతలను పరిచయం చేస్తూ వారి సాహిత్య సేవలను కొనియాడారు. నిరాడంబర రచయితలకు పురస్కారాలు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి మాట్లాడుతూ సమా జ మనుగడకు ఆ ప్రాంత సాహిత్యం, సంస్కృతి ప్రధా న భూమిక వహిస్తుందన్నారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు గత రెండేండ్లుగా తెలుగు పాఠ్యాంశాలను బోధిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ యోగ్యత కలిగిన సాహితీవేత్తలను శోధించి సముచితరీతిలో సాహితీ పురస్కారాలతో సత్కరించడం హర్షించదగిన విషయమన్నారు. జేఎన్టీయూ ఉపాధ్యక్షులు డాక్టర్ కట్టా నర్సింహారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు సాయన్న, తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచా ర్య భట్టు రమేశ్, విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రిం గు రామ్మూర్తి పాల్గొన్నారు. పద్య కవితలో ‘రహస్య భూతము’ గ్రంథానికి గాను డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య, వచన కవితా ప్రక్రియ లో ‘ఆకాశం కోల్పోయిన పక్షి’ గ్రంథానికి గాను కృష్ణుడు, బాల సాహిత్యంలో ‘ఈ అడవి మాది’ గ్రంథానికి గాను ఎం.కృష్ణకుమారి, కథానిక ప్రక్రియలో తప్ప గ్రంథానికి డాక్టర్ సిద్దెంకి యాదగిరి, నవల ప్రక్రియకు అక్ష ర వ్యాసం గ్రంథ రచయిత రామా చంద్రమౌళి, సాహిత్య విమర్శలో అక్షర న్యాసం రచయిత ఆచార్య జి. చెన్న కేశవరెడ్డి, నాటకం ప్రక్రియ లో ‘అశోక పథం’ గ్రంథానికి రచయిత చిట్టిప్రోలు వెం కట రత్నం, అనువాదం సాహిత్య ప్రక్రియలో ‘రాధాకృష్ణన్ జీవిత చరిత్ర’ గ్రంథ రచయిత టంకశాల అశోక్, వచన రచనలో ‘అవని’ రచయిత జయరాజు, రచయి తి ఉత్తమ గ్రంథం ‘అమ్మ బంగారు కల’ రచయిత్రి అ నూరాధ సుజలగంటిలకు ఒక్కొక్కరికి రూ.20,116ల నగదు పారితోషికంతో వక్తలు సత్కరించారు.