-ఉపాధ్యాయుల మహాధర్నాలో ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి
కవాడిగూడ, జూలై 7: యూఎస్పీసీ పోరాటం ఉపాధ్యాయుల కోసం మాత్రం కాదని, ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసమని ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు (పీవో-2018) ప్రకారం బదిలీలు, పదోన్నతులకు గల ఆటంకాలు తొలగిపోయాయని, విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభం పరిష్కారానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు.
గురువారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర సమస్యలు పరిష్కారించాలని కోరుతూ మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె. జంగయ్య, వై. అశోక్‌కుమార్, ఎం.రఘు శంకర్ రెడ్డి, పోచ య్య, హరికృష్ణ, ఎం. రవీందర్, టి. లింగారెడ్డి, డి. సైదులు, పి. రాజయ్య, బి. కొండయ్య, జాదవ్ వెంకట్రావ్, జాడి రాజన్న, మసూద్ అహ్మద్, శాగ కైలాసం, విజయసాగర్, భిక్షపతి, మహేశ్, చెన్న రాములు, రామారావు, మేడి చరణ్, శ్రీనివాస్, రాజనర్సుబాబు పాల్గొన్నారు.