హిమాయత్‌నగర్, జూలై 5:పెంపుడు జంతువులకు టీకాలూ తప్పనిసరి.. నేడు వరల్డ్ జూనోసిస్ డే కాలక్షేపం.. హోదా.. ఆత్మీయత.. ఒంటరితనం.. కారణమేదైనా మనిషి జీవితంలో పెంపుడు జంతువులు భాగమైపోయాయి. కుక్కలు, పిల్లులు, పావురాలు, కోళ్లు తదితరవాటిని నగరవాసులు ఆసక్తిగా పెంచుకుంటున్నారు. వీటి సంరక్షణలో అవగాహన లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. జంతువుల వల్ల మానవులకు సంక్రమించే వ్యాధులు, నివారణ మార్గాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూలై 6న జూనోసిస్డే (జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నివారణ దినోత్సవం)గా జరుపుకుంటారు.
జంతువులతో కలిసి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే.. వైరస్, బ్యాక్టిరియా,
పరాన్నజీవుల ద్వారా 200 రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. కుక్కల నుంచి రేబిస్, పందుల వల్ల మెదడువాపు, మేకలు, గొర్రెలతో ఆంథ్రాక్స్, ఆవులు, గేదెలనుంచి క్షయ, ఎలుకల వల్ల ప్లేగు, పక్షులతో సిటాకోసిస్ వంటి వ్యాధులు సోకే అవకాశం ఉందని వెటర్నరీ వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వైద్య రంగంలో జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నిర్మూలనకు ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ పెంపుడు జంతువులను పెంచుతూనే మనుషులు ఆరోగ్యానికి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
నివారణ చర్యలు
నేడు టీకాలు వేసే ప్రాంతాలు
రాష్ట్రంలోనే ఏకైక అతి పెద్ద వెటర్నరీ ఆసుపత్రి నారాయణగూడలో ఉంది. ఇక్కడ ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, ఆపరేషన్ థియేటర్ సౌకర్యాలు ఉన్నాయి. ఉప్పల్, సరూర్‌నగర్, బోయిన్పల్లి, మలక్‌పేట,
శాంతినగర్, ఫతర్ఘాట్, సీతారాంబాగ్ తదితర ప్రాంతాల్లో ఉన్న వెటర్నరీ ఆసుపత్రులో బుధవారం రేబిస్ నివారణ టీకాలు వేయనున్నారు.
వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి..
జంతువులతో మనుషులకు అనేక వ్యాధులు వస్తాయి. జంతు ప్రేమికులు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ఇండ్లలో వినియోగించే పరుపులు, మంచాలు, కుర్చీల వద్దకు కుక్కలను తీసుకు వెళ్లకపోవడమే శ్రేయస్కరం. ప్రతి ఏడాది పెంపుడు జంతువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి.
– డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సూపరిండెంట్, నారాయణగూడ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి